పయనించే సూర్యుడు న్యూస్ యాడికి జులై 5 యాడికి మండల పరిధిలో రాయలచెరువు గ్రామంలో శనివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా కందుల విత్తనాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకంలో భాగంగా సన్నకారు, చిన్న, సన్నకారు రైతులకు ఒక ప్యాకెట్ చొప్పున కందుల విత్తనాలు అందించారు. గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్లో రైతులు పాస్బుక్లు చూపించి విత్తనాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి ఏవో మహబూబ్ బాషా. మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య. నాగముని రెడ్డి. పంచాయతీ సెక్రటరీ అరుణ్ కుమార్. ఎంపీఈఓ పవన్ కుమార్. శాండ్ శీనా. సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.సకాలంలో విత్తనాలు అందడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు అని అధికారులు తెలిపారు.