రాష్ట్ర స్థాయి నృత్య పోటీల్లో దుమ్మురేపిన కరీంనగర్ బాలిక ‘నాన్సీ’ (శ్రీహిత)

​ఫోక్, వెస్ట్రన్ విభాగాల్లో ప్రథమ బహుమతులు ​సోలో పెర్ఫార్మెన్స్‌లో తృతీయ బహుమతి ​క్రేజీ మూవ్స్ డాన్స్ అకాడమీ శిక్షణకు ప్రశంసలు

​పయనించే సూర్యుడు జూన్ 2 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య :శంకరపట్నం మండలం పరిధిలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ బాల్య నృత్య కళాకారిణి నాన్సీ (పోలు శ్రీహిత) రాష్ట్ర స్థాయి సంస్కృతిక పోటీలలో అద్భుత ప్రదర్శనతో అలరించి, వరుస బహుమతులతో సరికొత్త రికార్డు సృష్టించింది. ​సన్ షైన్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో మే 30, 31 తేదీలలో కరీంనగర్ లోని ‘కళాభారతి’ ఆడిటోరియంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన “రాష్ట్ర స్థాయి సంస్కృతిక పోటీలు-2026” లో నాన్సీ స్థానిక ‘క్రేజీ మూవ్స్ డాన్స్ అకాడమీ’ తరపున పాల్గొంది. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీలలో తన అద్భుతమైన నృత్య శైలితో నాన్సీ లయబద్ధమైన మూవ్స్‌తో స్టేజ్‌పై దుమ్మురేపింది. ​వివిధ జిల్లాల నుండి వచ్చిన కఠినమైన పోటీని తట్టుకొని.. ‘ఫోక్’ (జానపదం) విభాగంలో ప్రథమ బహుమతి, ‘వెస్ట్రన్’ విభాగంలో ప్రథమ బహుమతి సాధించడమే కాకుండా, అత్యంత ప్రతిభావంతమైన ‘సోలో పెర్ఫార్మెన్స్’ లో తృతీయ బహుమతిని కైవసం చేసుకుంది. ​ఈ సందర్భంగా సన్ షైన్ డాన్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు గజ్జెల దర్మేందర్ సీనియర్ మాస్టర్ మిలీనియం శ్రీనివాస్ మాట్లాడుతూ.. నాన్సీ అసాధారణమైన నృత్య ప్రతిభను ప్రత్యేకంగా అభినందించారు. ఇంత చిన్న వయసులోనే ఎంతో ఈజ్ తో డాన్స్ చేస్తోందని, భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో పెద్ద పెద్ద స్టేజీలపై ప్రదర్శనలు ఇస్తూ, మరెన్నో ఉన్నతమైన బహుమతులు అందుకోవాలని వారు ఆకాంక్షించారు. ​తన కుమార్తె సాధించిన ఈ విజయం వెనుక ‘క్రేజీ మూవ్స్ డాన్స్ అకాడమీ’ కి చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్స్ అక్షయ్ మాస్టర్, భాను మాస్టర్ కటోర శ్రమ అంకితభావంతో నాన్సీ ని ఒక స్టార్ల తీర్చిదిద్దడానికి వారు పడిన తపన మరువలేనిది నాన్సీ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తూ మాస్టర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర స్థాయిలో కరీంనగర్ కీర్తిని చాటిన బాలిక నాన్సీని పలువురు కళాకారులు స్థానికులు అభినందనలతో ముంచెత్తుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *