రెండేళ్ళ కూటమి ప్రభుత్వ ప్రస్థానం విజయోత్సం సభను విజయవంతం చేయుటకై పిలుపు

పయనించే సూర్యుడు జూన్ 14 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి అయిన సంధర్బంగా విజయోత్సావాలను నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో 15.06.2026న సోమవారం ఉదయం 10 గంటలకు కర్నూలు నగరంలోని బైరెడ్డి ఫంక్షన్ హాల్, బాలజి నగర్, సంతోష్ నగర్ దగ్గర నిర్వహించబడుతుంది. ఇందు నిమితమై ఈ రోజు తెలుగుదేశంపార్టీ, జనసేన, బిజేపి పార్టీల నాయకులు ఫంక్షన్ హాల్ ను పరిశీలించి రావడం జరిగింది. కర్నూలు జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయం నందు కర్నూలు జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు గుడిసె ఆది కృష్ణమ్మ, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు సురేష్, బిజేపి జిల్లా అధ్యక్షులు రామక్రిష్ణ సమావేశమై చర్చించడం జరిగింది. అనంతరం వారు పత్రికల వారితో మాట్లాడుతూ ఈ విజయోత్సవ కార్యక్రమమునకు జిల్లా ఇంచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు , జిల్లా మంత్రి టి.జి.భరత్ గుప్తా , జోన్ 5 టిడిపి ఇంచార్జి శ్రీనివాస రెడ్డి గ కర్నూలు జిల్లా కలెక్టర్ డా..ఎ.సిరి , కూటమి పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, చైర్మన్లు హాజరు కానున్నారు. ఈ సభకు కూటమి పార్టీలకు చెందిన రాష్ట్ర/జిల్లా/ మండలం/ గ్రామం/ వార్డు/బూత్ స్థాయి నాయకులు అత్యధికంగా పాల్గొని విజయోత్సవ సభను విజయవంతం చేయవలసినదిగా విఘ్నప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *