జనం న్యూస్ జూన్ 7(రిపోర్టర్ నల్లబోతుల రాజు)అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం నూతన తహసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన జయశ్రీ ని శనివారం స్థానిక నాయకులు, సామాజికవేత్తలు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు,ఈ సందర్భంగా వజ్రకరూరు మేజర్ గ్రామ పంచాయతీ ఫార్మర్ సర్పంచ్ మోనాలిసా,సామాజికవేత్త అంబేద్కర్ అవార్డు గ్రహీత బెంజిమెన్,సుకుమార్,టిడిపి నాయకులు జయన్న చౌదరి,వైయస్సార్ సిపి నాయకులు బెస్త రామాంజనేయులు,ఆంధ్రప్రభ రిపోర్టర్ పట్టా కాజాపీర,తదితరులు పుష్పగుచ్చాను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని కోరారు,తహసిల్దార్ జయశ్రీ మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన పరిపాలన అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు,ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ నరేష్ కుమార్,ఇతర అధికారులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు