వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో

పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు .

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జులై 6 పెనుగంచిప్రోలు గ్రామంలోని పెనుగంచిప్రోలు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ పార్టీ అధ్యక్షులు గుడిమెట్ల శంకర్ ఆధ్వర్యంలో పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ మండల పార్టీ అధ్యక్షులు వూట్ల నాగేశ్వరావు పాల్గొని కేక్ కట్ చేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ప్రజల పట్ల చూపిన సేవాభావం, నిరుపేదల కోసం చేసిన పోరాటం, ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్, రాష్ట్ర బిసి సెల్ ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు ఎన్టీఆర్ జిల్లా బిసి సెల్ ఉపాధ్యక్షులు చేని రాంబాబు, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు దేరేంగుల శ్రీను , కాపు నాయకులు చెక్క రమణ , కుంచాల సుదీర్ ,మండల సోషల్ మీడియా కన్వినర్ నల్లబోతుల వెంకటేష్, గ్రామ యువజన విభాగం అధ్యక్షులు మల్లెబోయిన సైదులు , మండల ఎస్సి సెల్ నాయకులు తుమ్మల రమణ ,బిసి నాయకులు బలుగూరి శివ ,గ్రామ విద్యార్థి విభాగం అధ్యక్షులు తూము గోపి , తూము సతీష్ ,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వంగవీటి మోహన్ రంగా కి ఘన నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *