సరైన అనుమతులు లేని బిఈడి కళాశాలలా అఫిలియోషన్ ను రద్దు చేయాలి.

* బిఈడి కళాశాలలా యాజమాన్యం తో కుమ్మక్కైన రాయలసీమ యూనివర్సిటీ అధికారులను తొలగించాలి * ఆర్ పి ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆఫ్రిది డిమాండ్

పయనించే సూర్యుడు జూన్ 6 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. ఎమ్మిగనూరు పట్టణంలో సరైన అనుమతులు లేని బి ఈ డి కళాశాలలా అఫ్లీయేషన్ ను రద్దు చేయాలని ఆర్ పి ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆఫ్రిది డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాయలసీమ యూనివర్సిటీ అనుబంధంగా ఎమ్మిగనూరు పట్టణంలో నాలుగు బిఈడి కాలేజీలు ఉన్నాయని వాటిలో కొన్ని కాలేజీలో అర్హతలు లేని వారిని ప్రిన్సిపాల్ గా మరియు లెక్చరర్స్ గా వీధులు నిర్వహిస్తున్నారని అంతేకాకుండా వేరే రాష్ట్రాల నుంచి బిఈడి అడ్మిషన్లు చేసుకుంటూ లక్షల కూడగట్టుకుంటున్నారని, వారు కళాశాలకు రాకపోయినా లేదా బీఈడీ బ్లాక్ టీచింగ్ మరియు ప్రాక్టికల్స్ కు రాకపోయినా వారి నుంచి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేసుకుంటున్నారని ఇంత జరుగుతున్నా కూడా యూనివర్సిటీ అధికారులు బీఈడీ కళాశాల యాజమాన్యం ఇచ్చే ముడుపులు తీసుకుని వారికే మద్దతుస్తున్నారని తప్ప ఎటువంటి చర్యలు తీసుకోలేదు.ఇప్పుడు బి ఈ డి కాలేజీల ఆఫిలియెషన్ కూడా ఆ ముడుపులు తీసుకున్న యూనివర్సిటీ అధికారులే వస్తున్నారని ఒకవేళ అలాగే జరిగితే ఖచ్చితంగా ఆర్ పి ఎస్ ఎఫ్ విద్యార్ధి సంఘం గా అడ్డుకుంటామని వారు హెచ్చరించారు ఇప్పటికైనా రాయలసీమ యూనివర్సిటీ అధికారులు స్పందించి సరైన అనుమతులు లేని బీఈడీ కళాశాలపై అలాగే వారికి వత్తాసు పలికిన రాయలసీమ యూనివర్సిటీ అధికారులు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి మరియు గవర్నర్ కి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం నాయకులు మహబూబ్, నర్సింహా నాయుడు, షైక్ష వలి, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *