సాలూరలో ముగిసిన అఖండ హరినామ సప్తహ.

* అతిథులకు సత్కారం చేస్తున్న సప్తహ నిర్వాహకులు.

పయనించే సూర్యుడు న్యూస్ మే 26 సాలూర : సాలూరలో 7 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన అఖండ హరినామ సప్తహ 8వ రోజు సోమవారంతో ముగిసింది.నిత్యం మండల ప్రజలు,భక్తులు హరినామ సప్తహా వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చి భజనలు,కీ ర్తనలు చేసి పలు పీఠాధిపతులు చేసిన ప్రవచనాలను వింటూ మంత్రముగ్ధులయ్యారు. సప్తహా వద్ద 8 రోజుల పాటు నిత్యాన్నదానాన్ని సప్తహ నిర్వాహకులు చేపట్టారు.లోక కళ్యాణం,రాష్ట్ర అభివృద్ధి, ప్రజలు, పశుపక్షాదులు, వృద్ధులు, పిల్లాపాపల సంక్షేమం, పంటలు సమృద్ధిగా పండి రైతులు లాభాల బాటలో ఉండాలనే సంకల్పంతో ఆ భగవంతుడిని కొలుచుతూ భక్తిశ్రద్ధలతో అఖండ హరిణామ సప్తహ నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు,గ్రామ పెద్దలు పేర్కొన్నారు .హరినామ సప్తహకు హాజరైన భజన మండలిలు, పీఠాధిపతులకు ఆదిత్యాన్ని అందిస్తూ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. మండపం వద్ద నిర్వాహకులు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సప్తహ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *