పయనించే సూర్యుడు జూన్ 9 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. సుల్తానాపురం గ్రామంలో ఘనంగా నిర్వహించిన హజ్రత్ షాషా షేక్షావలి తాత ఉరుసు మహోత్సవాల్లో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా దర్గా వద్ద ప్రార్థనలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉరుసు వేడుకలు మత సామరస్యానికి, సౌభ్రాతృత్వానికి ప్రతీకలని పేర్కొన్నారు. అన్ని మతాల ప్రజలు కలిసి భక్తిశ్రద్ధలతో పాల్గొనడం భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనమని అన్నారు. సమాజంలో ఐక్యత, పరస్పర గౌరవం, సోదరభావం పెంపొందించడంలో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. అనంతరం దర్గా నిర్వాహకులు, మత పెద్దలు, భక్తులను మర్యాదపూర్వకంగా కలుసుకుని ఉరుసు మహోత్సవాల విజయవంతమైన నిర్వహణకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు నరసింహులు, గౌస్, వెంకటేష్, పురుషోత్తం, మహాదేవ, చంద్ర, వెంకటేష్, భరత్, వీరేష్ తదితరులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.