పయనించే సూర్యుడు జూలై 7, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ పీజీ ఆర్ ఎస్ లో బాధితులు సూరత్ సుబ్రమణ్యేశ్వరరావ్ ఫిర్యాదు. ఈ సందర్భంగా సుబ్రమణ్యేశ్వరరావ్ మాట్లాడుతూ కాకినాడ జిల్లా పిఠాపురం మండలం భోగాపురం అనపర్తికి చెందిన సర్వేనెంబర్ 190 లో సుమారు 13 1/2 సెంట్లు భూమికి సంబంధించి ఉత్తరాన మా నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా సిసి రోడ్ నిర్మాణం చేయడానికి ప్రయత్నించడంతో సోమవారం కాకినాడ లో గల పిజిఆర్ఎస్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. అయితే మాకు హామీ పత్రం అందించి సీసీ రోడ్ నిర్మించుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని సుబ్రహ్మణ్యేశ్వరరావ్ తెలిపారు. అయితే ఈ విషయమే కలెక్టర్ కి తెలియజేయడం జరిగిందని ఆయన స్పందిస్తూ డిపిఓ కి బాధ్యతలు అందించారని అన్నారు.