పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 3 మందమర్రి మండల ప్రతినిధి బొద్దులభూమేష్ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 51 వ డివిజన్ లక్ష్మి నగర్ కాలనీలో 12 వా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికన్న ముందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా జై తెలంగాణ జోహార్ తెలంగాణ అమర వీరులకు అని పెద్ద పెట్టున నినాదాలు చేశారు ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ కారుల ఐక్య వేదిక సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మరియు బీసీ సంఘాల నాయకుడు గజెల్లి వెంకటయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయ్యి 12 సంవత్సరాలు గడుస్తున్నా తెలంగాణ లో సీమాంధ్ర పెట్టుబడు దారుల ఆధిపత్యం కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసే విధంగా సీమాంధ్ర పార్టీలు తెలంగాణ ప్రజలను రెచ్చ గొడుతున్నారని రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తెలంగాణ-సీమాంధ్ర ప్రజలు కలిసే ఉంటున్నారనే విషయాన్ని ఆంధ్ర పాలకులు విస్మరిస్తున్నారని 10 సంవత్సరాల కాలం నుండి సీమాంధ్ర అమరావతి లో రాజధాని నిర్మాణం చేయడానికి చేతగాని ఆంధ్ర పాలకులు తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో తెలంగాణ లో ద్వేషాలను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి చెప్పాలని ఆంధ్ర పాలకులను హెచ్చరించారు తెలంగాణ లోని మేధావుల పై మీడియా పై సీమాంధ్ర పాలకులు అక్రమ కేసులు బనాయించి ఆంధ్ర పాలకులు చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్న తెలంగాణ ఉద్యమకారులపై తప్పుడు ప్రచారాన్ని వెంటనే మానుకోవాలని ఆంధ్ర పాలకులకు హిత బోధ చేసారు.అదే విధంగా తొలిదశ-మలిదశ తెలంగాణ ఉద్యమం లో వేలాది మంది ఉద్యమ కారులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని వారి బలిదానాల పునాదులపైననే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాజ్యంగబద్దంగా ఏర్పాటు అయినదనే విషయాన్ని ఆంధ్ర పాలకులు గుర్తుఎరుగాలని సూచించారు.ఇప్పటికైనా సీమాంధ్ర పాలకులు తెలంగాణ రాష్ట్రంపై ఆధిపత్యం చెలాయించే విధానానికి స్వస్తి చెప్పాలని తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసే విధంగా వ్యవహరించే విధానాలకు స్వస్తిపలకాలని లేని యెడల గతంలో మాదిరిగానే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఆంధ్ర గోబ్యాక్ అనే ఉద్యమం పురుడు పోసుకుంటదని తెలియజేస్తూ ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య,గౌరవ అధ్యక్షులు రాళ్లబండి రాజన్న,ప్రధాన కార్యదర్శి పూదరి నర్సయ్య, కార్యదర్శి ఏ రాజేశం,నాయకులు చిప్ప రామస్వామి,జి రాజిరెడ్డి, రాజన్నగౌడ్, జి లక్ష్మణ్, బాపు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు.