“వికసిత్ భారత్ – జీ రామ్ జీ” కార్యక్రమాన్ని ప్రారంభించిన పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష

పయనించే సూర్యుడు న్యూస్ జులై 3 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్.కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు చేయాలనే లక్ష్యంతో పలాస నియోజకవర్గం పలాస మండలంలోని తర్లకోట గ్రామం, మందస మండలం కుసుమల గ్రామంలో “వికసిత్ భారత్ – జీ రామ్ జీ” కార్యక్రమం ప్రారంభోత్సవంలో పలాస నియోజకవర్గ శాసనసభ్యులు గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, కూలీల సంక్షేమానికి, ఉపాధి హామీ పనుల్లో నాణ్యత పెంపునకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గ్రామీణ ప్రజలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి, ప్రభుత్వ సేవలను వేగవంతంగా అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.”వికసిత్ భారత్ – జీ రామ్ జీ” కార్యక్రమం ద్వారా:125 రోజుల ఉపాధి హామీ పనుల ప్రణాళిక రూపొందించడం.,గ్రామసభల ద్వారా గ్రామ పంచాయతీ ప్రణాళిక (జీపీపీ) రూపొందించడం, శ్రమశక్తి ఆధారిత సహజ వనరుల అభివృద్ధి పనులకు ప్రాధాన్యత కల్పించడం,గ్రామ పంచాయతీల ప్రణాళికల్లో అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యాన్ని నిర్ధారించడం.నిర్దిష్ట సమయాల్లో పనులు పూర్తి చేసి ఆస్తుల సృష్టికి ప్రాధాన్యం ఇవ్వడం.సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన అమలు, పారదర్శకత పెంపొందించడం వంటి ముఖ్య లక్ష్యాలు అమలు చేయబడుతున్నాయని ఎమ్మెల్యే వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గ్రామీణాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఎన్నో కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంగా పనిచేస్తూ గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాల విస్తరణకు కృషి చేస్తోందని పేర్కొన్నారు.పలాస నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరేలా ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు గ్రంధాలయ చైర్మన్ పీరికట్ల విఠల్ , ఆయా మండలాల అధ్యక్ష కార్యదర్శులు కూటమి ముఖ్య నాయకులు అధికారులు, వారి సిబ్బంది ,స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *