హైవేపై రోడ్డు ప్రమాదం: ఒకరి దుర్మరణం

పయనించే సూర్యుడు న్యూస్ జూలై 04 యడ్లపాడు మండల ప్రతినిధి.. ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆటోలో మామిడికాయలు తీసుకుని గుంటూరు వైపు వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఎడ్లపాడు వద్ద కొత్తగా నిర్మిస్తున్న పెట్రోల్ బంకుల సమీపంలో, వెనుక నుంచి వచ్చిన ఒక కారు వీరి ఆటోను బలంగా ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది.ఈ ప్రమాదంలో ఆటో పల్టీలు కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే అంబులెన్స్ సిబ్బంది మరియు ఎడ్లపాడు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రుడిని మెరుగైన చికిత్స కోసం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రమాదానికి కారణమైన కారు పరారీలో ఉన్నప్పటికీ, ఆ కారు నంబర్ ప్లేట్ పగిలిపోయి ఘటనా స్థలంలోనే పడిఉన్నట్లు గుర్తించారు. పూర్తి వివరాలను చేయాల్సి ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *