సీనియర్ జర్నలిస్ట్ అజ్మీర వీరన్న తల్లి ఈరికి ఘన నివాళి

మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన మండల విద్యాధికారి జయరాజు

పయనించే సూర్యుడు న్యూస్ జూలై 5 సింగరేణి రిపోర్టర్ నరేష్ కారేపల్లి మండల పరిధిలోని అప్పాయిగూడెం గ్రామ పంచాయతీ భిక్య తండాకు చెందిన మండల మాజీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ జర్నలిస్ట్ అజ్మీర వీరన్న తల్లి అజ్మీర ఈరి ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. మృతురాలి మరణవార్త తెలుసుకున్న మండల విద్యాధికారి (ఎంఈఓ) జయరాజు శనివారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అజ్మీర ఈరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సిబ్బంది మోతిలాల్, విజయ్, రాము, నాయకులు రామ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *