పంబాల కులస్తులకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు వెంటనే ఇవ్వాలి.

పయనించే సూర్యుడు జులై 5 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య :పంబాల కులస్తులకు ఎస్సీ గ్రూప్ వన్ కుల ధ్రువీకరణ పత్రాలు వెంటనే ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి పంబాల కుల ఐక్యవేదిక జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రౌతు అనిల్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో శనివారం నాడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పంబాల కులస్తులను వర్గీకరణ కింద జీవో సైతం జారీ చేసిందని అసెంబ్లీలో పంబాల కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చిందని ఆయన తెలిపారు. గత సంవత్సరం నుండి కుల ధ్రువీకరణ పత్రాల కొరకు విద్యార్థులు, నిరుద్యోగ యువత కాళ్లకు చెప్పులు అడిగేలా తిరుగుతున్నారని ఆయన అన్నారు. ఇంతకుముందు మాల కులం కింద సర్టిఫికేట్ పంబాల కులస్తులకు ఇచ్చినారని ప్రస్తుతం ఆ సర్టిఫికెట్లను ప్రభుత్వానికి వాపసు చేసినామని అనిల్ వివరించారు. పంబాల ఏసీ కులం సర్టిఫికెట్లు సిద్దిపేట మెదక్ కామారెడ్డి హైదరాబాద్ తదితర జిల్లాల్లో ధ్రువపత్రాలు ఇచ్చినారని ఆయన తెలిపారు. కేవలం కరీంనగర్ జిల్లాలోనే ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. తాము ఎల్లమ్మ పోచమ్మ పెద్దమ్మ మైసమ్మ తదితర గ్రామదేవతలను పూజిస్తామని ఆయన అన్నారు. శృతి, జెముడికే, పంబజోడు తాళాలు పలక ఉపయోగిస్తామని ఆయన చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో దొబ్బల రాజు, గొట్టె అక్షిత్ కొరిమి గణేష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *