యువ వికాసం దరఖాస్తులు ‌

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి జూన్ 1 రాజీవ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులు పరిశీలించి అరులైన వారికి రుణాలు మంజూరు చేయాలని జెట్టి నరేంద్ర బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కోరారు నిరుద్యోగుల నుంచి లక్షల దరఖాస్తులు స్వీకరించి ఒకటైన అమలు చేయకుండా ప్రభుత్వం నిరుద్యోగుల మోసం చేస్తుందన్నారు రూ 50. వేల నుండి 4. లక్షల రూపాయల వరకు రుణాలు ఇస్తామని సామాన్య ప్రజలకు వంచనకు గురి చేసిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏండ్ల గడుస్తున్న ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిరుద్యోగులకు మాభ్యపెడుతుందని విమర్శించారు రానున్న రోజుల్లో విద్యార్థి మరియు నిరుద్యోగులతో ఏ ప్రభుత్వమైనా ఆటలాడిన వాళ్లకు పుట్టగతులు ఉండవని అన్నారు యువ వికాస్ పథకాన్ని అమలు చేయాలని లేని పక్షాన కలెక్టరేట్ ముట్టడిస్తామని అన్నారు ఈ సమావేశంలో బిసి నాయకులు ఎండి ముక్తార్ బాయ్ ఈశ్వర్ రవి రమేష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *