పయనించే సూర్యుడు జులై 5 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య :ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టి పి యు ఎస్ )దశలవారీగా పోరాటానికై పిలుపునిచ్చింది.అందులో భాగంగా శనివారం నాడు మండల స్థాయిలో ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి పి.ఆర్.సి అమలు, పెండింగ్ డీఏల విడుదల, సిపిఎస్ రద్దు , జీవో నెంబర్ 25 సవరణ చేయాలని తహసిల్దార్ ద్వారా ప్రభుత్వానికి వినతి పత్ర సమర్పణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కట్కూరి శ్రీధర్ రెడ్డి మండల శాఖ అధ్యక్షులు కామిరెడ్డి రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి గోపాల కిషన్ కాంప్లెక్స్ బాధ్యులు ముదాం కృష్ణమూర్తి, భూక్యా దేవేందర్ తదితరులు పాల్గొన్నారు