వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన తన్నీరు నాగేశ్వరరావు

పేదవాడి ఇళ్ళ కోసం అహర్నిశలు శ్రమించిన మహోన్నతమైన వ్యక్తి వంగవీటి మోహన్ రంగ _

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జులై 5 జగ్గయ్యపేట పట్టణం కోదాడ రోడ్డులో ఉన్న వంగవీటి మోహన్ రంగా విగ్రహం వద్ద పట్టణ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన 79వ జయంతి వేడుకలు లో జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్ , ముఖ్య నాయకులు పాల్గొని వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక బస్టాండ్ సెంటర్‌ నందు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వంగవీటి మోహన్ రంగా ప్రజల హక్కుల కోసం, పేదల సంక్షేమం కోసం నిరంతరం పోరాడిన ప్రజానాయకుడని కొనియాడారు. ఆయన ఆశయాలు, సేవా స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.. జీవితం ప్రజా సేవకు ప్రతీక. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, ప్రజల సంక్షేమానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిది. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ప్రజలకు మరింత సేవ చేయాలని ఈ సందర్భంగా సంకల్పిస్తున్నాం.. ప్రజల మధ్యే జీవించారు, ప్రజల కోసమే పోరాడారు. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలబడటం, అన్యాయానికి ఎదురు నిలవడం, పేదలు మరియు బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయడం ఆయన జీవిత లక్ష్యం. అందుకే ఆయన ఈ రోజుకీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.. ఈ కార్యక్రమంలో వంగవీటి మోహనరంగా అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *