ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం.

ఘనంగా ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ శ్రవణ్ కుమార్.

పయనించే సూర్యుడు జూలై 5 తొర్రూరు మండలం మహబూబాబాద్ జిల్లా రిపోర్టర్ శ్రీధర్. పాలకుర్తి శాసనసభ సభ్యురాలు యశస్విని రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు తొర్రూర్ మున్సిపల్ చైర్మన్ శ్రవణ్ కుమార్ శనివారం పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహప్రవేశ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు సొంత ఇంటి కలను సాకారం చేసుకోవడం ఎంతో ఆనందదాయకమని ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు శాశ్వత నివాస సౌకర్యం కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. కొత్త ఇంటిలో అడుగుపెట్టిన కుటుంబాలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ హౌసింగ్ AE యామిని బసన బోయిన రాజేష్ రాజు పార్టీ నాయకులు, లబ్ధిదారులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *