క్షవరవృత్తి దారుణ్ణిహత్య చేసిన ముద్దాయిని హత్యా నేరం కింద అరెస్టు చేయాలి

ఏ.పి. ప్రజా కుల సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు ఎల్వి సుబ్బయ్య

పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ జూలై 5 క్షవర వృత్తిదారుడైన గుడివాడ మహేద్ర (52)ని అకారణంగా ఒంగోలు నడిబొడ్డున పట్టపగలు కత్తెరతో పొడిచి హత్య చేసిన వడ్డీ వ్యాపారస్తుడైన రామారావును అదుపులోకి తీసుకొని హత్యా నేరం కింద వెంటనే అరెస్టు చేయాలని ఏ.పి. ప్రజా కుల సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు ఎల్వి సుబ్బయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన గూడూరు లో విలేకరులతో మాట్లాడుతూ, ఒంగోలు స్థానిక బస్టాండ్ వద్ద గల శ్రీనివాస హెయిర్ స్టైల్స్ నందు గుడివాడ మహేంద్ర వర్కర్ గా పని చేస్తున్న క్రమంలో ధనిక వర్గ పెత్తందారుడు మరియు వడ్డీ వ్యాపారస్తుడు , అహంకారి అయిన రామారావు మద్యం సేవించి కటింగ్ చేయమని అడగడంతో ఇప్పుడు చేయలేను తర్వాత రండి అని చెప్పినందున రామారావు ఆగ్రహానికి గురై సెలూన్ లో ఉన్న కత్తెరను తీసుకొని వర్కర్ మహేంద్రని కుతికపై పొడవడంతో అతను వెంటనే క్రింద పడిపోవడంతో, స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహేంద్ర మృతి చెందాడు. ఈ సంఘటన సభ్య సమాజం జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఈ హత్యకు కారణమైన రామారావుని హత్య నేరం క్రింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చెయ్యాలని ,బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రజక ఇతర,బీసీ కులాలపై నాయీబ్రాహ్మణ వృత్తి దారులపై యదేచ్చిగా దాడులు ,హత్యలు, హత్యాచారయత్నాలు అధికమవుతున్న దృష్ట్యా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ లాంటి రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వo పటిష్టమైన చర్యలు చేపట్టాలనీ ఏ.పి. ప్రజా కుల సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు ఎల్.వి సుబ్బయ్య., నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు. ఎం. గురునాథంప్రసాదు, బీఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ భాస్కర్ గౌడ్ గూడూరు పట్టణ బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు జి వెంకటేశ్వరరాజు . గూడూరు నియోజక వర్గ ఇన్చార్జి. ఎం .సుబ్రహ్మణ్యం ఈ అమానుషన సంఘటనపై త్రీవంగా ఖండిస్తూ రాష్ట్ర లోని కూటమి ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకొని నాయి బ్రాహ్మణ కులంకీ చెందిన వ్యక్తిపై దాడి చేసి హత్య చేసిన వ్యక్తినీ తక్షణం అరెస్టు చేయాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *