పయనించే సూర్యుడు జూలై 5. పాపన్నపేట మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్ కామారెడ్డి జిల్లా,వెంకంపల్లి నుండి మెదక్ జిల్లా పాపన్నపేట వరకు ముద్దాపూర్ మీదుగా రోడ్డు నిర్మాణానికి రూ.22.50 కోట్ల మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పాపన్నపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ గౌడ్ తెలిపారు.మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కృషితో ఈరోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని ఆయన వెల్లడించారు.గత కొన్ని సంవత్సరాల క్రితం వెంకంపల్లి ముద్దాపూర్ మధ్య బ్రిడ్జి నిర్మాణం పూర్తయినప్పటికీ, ముద్ధాపూర్ నుండి పాపన్నపేట వరకు రోడ్డు లేక బ్రిడ్జ్ నిరుపయోగంగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఈవిషయమై మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారన్నారు.ఈ రోడ్డు నిజామాబాద్,కామారెడ్డి జిల్లాల నుండి మెదక్ జిల్లాకు రాకపోకలు దగ్గరవుతాయని ఆయన వెల్లడించారు.రోడ్డు నిర్మాణానికి కృషి చేసిన మెదక్ ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.