
పయనించే సూర్యుడు న్యూస్ జూలై 6 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ మట్టి బిడ్డ.అశ్వారావుపేట మండలంలో నారంవారిగూడెం గ్రామంలో అసాధారణ ధైర్య సాహసాల ప్రదర్శకుడు భూక్యా కృష్ణ నాయక్ జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు భూక్యా వసంతరావు నాయక్ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఈనెల 1వ తేదీన మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా అహమ్మడ్పూర్లో ఘనంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రంగాలలో దేశవ్యాప్తంగా విశేష ప్రతిభ కనబరిచిన ప్రతిభావంతులను గుర్తించి పురస్కారాలు అందజేసే ఈ వేడుకలోమన తెలంగాణ వాసి భూక్యా కృష్ణ నాయక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇప్పటికే రాష్ట్ర, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిల్లో తన అసాధారణ స్టంట్స్తో ఎన్నో అవార్డులను కొల్లగొట్టిన కృష్ణ నాయక్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అద్భుతమైన సాహస ప్రదర్శనలు ఇస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం సాహసాలకే పరిమితం కాకుండా సమాజంలో వేళ్లూనుకుపోయిన మూఢ నమ్మకాలను పార చోలడానికి సైన్స్ యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు. యువతలో స్ఫూర్తిని నింపుతూ ఆయన చేస్తున్న మోటివేషన్ కార్యక్రమాలను మహారాష్ట్ర ప్రముఖులు ప్రత్యేకంగా కొనియాడారు. ప్రముఖుల చేతుల మీదుగా మన సన్మానం ఈ అద్భుత వేడుకలో పాల్గొన్న ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు మరియు రాజకీయ నాయకులు పూజ్య శ్రీ శేఖర్ మహారాజ్ జిల్లా పరిషత్ చైర్మన్ ధూమాళ్ పండిత్ రావు బంజారా లిపి రూపకర్త రమావత్ రాజేంద్ర (గుజరాత్ స్క్రిప్ట్) మరియు తెలంగాణ బంజారా ఎంప్లాయ్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భూక్యా శోభన్ నాయక్ చేతుల మీదుగా కృష్ణ నాయక్కు ఘన సన్మానం జరిగింది. ఆయన సేపలను అసాధారణ ప్రతిభను అభినందిస్తూ రాష్ట్రీయ ప్రముఖ స్టంట్ కళాకారుడు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రాన్ని అందించి భారీగా సత్కరించారు. లక్ష్యం పెద్దది ఆదరిస్తే గిన్నీస్ రికార్డే ధ్యేయం ఈ సందర్భంగా అవార్డు గ్రహీత భూక్యా కృష్ణ నాయక్ తన అంతరంగాన్ని పంచుకుంటూ రెండు ముఖ్యమైన విషయాలను వ్యక్తపరిచారుగిన్నీస్ వరల్డ్ రికార్డే నా లక్ష్యం ప్రభుత్వం గానీ లేదా నమాజంలోని దాతలు గానీ నమాజంలోని ఎవరైనా ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని అద్భుత సాహసాలు ప్రదర్శించ ప్రతిష్టాత్మకమైన గిన్నీస్ వరల్డ్ రికార్డను మన భారతదేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడమే నా ప్రధాన లక్ష్యం, సామాజిక చైతన్యమే నా ధ్యేయం వెనుకబడిన బలహీన వర్గాల ప్రజల్లో ఉన్న రకరకాల అనుమానాలను అపోహలను మరియు మూఢనమ్మకాలను వూర్తిగా తొలగించడమే నా ధ్యేయం ఇందుకోసం కేవలం మాటలతో కాకుండా సైన్స్ మరియు నిజాలను దృశ్యరూపంలో (లైవ్ డెమోల ద్వారా) ప్రదర్శించి వారిలో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందిస్తాను తెలంగాణ గడ్డపై వుట్టి పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో జాతీయ స్థాయి పురస్కారాన్ని అందుకోవడం పట్ల బంజారా సమాజంతో పాటు తెలుగు ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆయన మరెన్నో ఉన్నత గౌరవించాలని శిఖరాలను అధిరోహించాలని పలువురు ప్రముఖులు ఆశీర్వదించారు.