వివాదంగా మారిన సీసీ రోడ్ నిర్మాణం.. మా అనుమతులు లేకుండా సీసీ రోడ్ నిర్మిస్తున్నారంటూ సూరత్ పాండురంగారావు తనయుడు సూరత్ సుబ్రహ్మణ్యేశ్వర రావు ఆరోపణ..

పయనించే సూర్యుడు జూలై 6, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా పిఠాపురం మండలం బి ప్రత్తిపాడు చింతల రేవడి దగ్గర గల గ్రామకంఠం సర్వే నెంబరు 190 లో గల 13 సెంట్లు భూమిలో ఇల్లు నిర్మాణం కొరకు అన్నదమ్ములైన సూరత్ విజయ్ కుమార్ సూరత్ సుబ్రహ్మణ్యేశ్వర రావుకు తండ్రి సూరత్ పాండురంగారావు ఇద్దరికీ సమానంగా స్థలాన్ని రాయడం జరిగింది. అయితే ఆ స్థలం ప్రక్కగా రోడ్డు నిర్మిస్తామంటూ గత నాలుగు నెలలుగా మాజీ సర్పంచ్ ఊట రామకృష్ణ చొరవ తీసుకుని మా అంగీకారం లేకుండా రోడ్డు నిర్మిస్తున్నారంటూ సూరత్ సుబ్రమణ్యేశ్వర రావు సూరత్ పాండురంగారావులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా భూమి కి సంబంధించి రోడ్డు వేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదని అయితే రెండున్నర అడుగులకు సంబంధించి రోడ్డు నిర్మాణానికి మా స్థలం కూడా ఉందని అయితే మాకు సంబంధించి అనుమతులు తీసుకోలేదని వారు తెలిపారు. రోడ్డు నిర్మించుకోవడానికి మాకు అభ్యంతరం లేదు గాని మా స్థలంలో కరెంట్ ఫౌల్ వేస్తామంటూ తెలిపారని దానిని మార్చి వేరే దగ్గర వేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని వారు తెలిపారు. అయితే అరవ ప్రసాద్, అరవ అప్పన్న, అరవకృష్ణ, అరవ బుచ్చిబాబు, వారి కుటుంబాలు వారు మాపై దాడి చేస్తున్నారని మమ్మల్ని నివేsన ఇబ్బందులు గురి చేస్తున్నారని వారు ఆవేదంతో తెలిపారు. మా నివేశన స్థానంలో రోడ్డు నిర్మాణం కోసం మా అనుమతి తీసుకుని రోడ్డు నిర్మిస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *