ప యనించే సూర్యుడు జూలై 6 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) మంత్రి సుభాష్ పిలుపుతో కొనసాగుతున్న మానవతా సహాయం వ్యాపారుల పునరావాసానికి అందరి సహకారం అభినందనీయం సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ రామచంద్రపురం ద్రాక్షారామం మార్కెట్‌లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన వ్యాపారులను ఆదుకునేందుకు రామచంద్రపురం నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ ముందుకొచ్చింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్ మానవతా దృక్పథంతో రూ.2 లక్షలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కలిసి రూ.82 వేల చొప్పున మొత్తం రూ.2,82,000 విరాళాన్ని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యంకు శనివారం అందజేశారు. ద్రాక్షారామం మార్కెట్‌లో అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే మంత్రి వాసంశెట్టి సుభాష్ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొవడంతో పాటు, బాధిత వ్యాపారులను ఆదుకునేందుకు వ్యక్తిగతంగా రూ.20 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అలాగే కష్టకాలంలో ఉన్న వ్యాపారులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మంత్రి సుభాష్ పిలుపునకు విశేష స్పందన లభించగా, పలువురు దాతలు, ప్రజాప్రతినిధులు ఉదారంగా విరాళాలు అందిస్తూ అగ్ని బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అందించిన రూ.2.82 లక్షల విరాళం బాధితులకు ఎంతో ఊరటనిస్తుందని వాసంశెట్టి సత్యం తెలిపారు. ప్రస్తుతం అగ్నిప్రమాదానికి గురైన మార్కెట్ ప్రాంతంలో మంత్రి సుభాష్ ఆదేశాల మేరకు వాసంశెట్టి సత్యం ఆధ్వర్యంలో నూతన షెడ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, వ్యాపారులు త్వరలోనే తమ వ్యాపారాలను తిరిగి ప్రారంభించేలా మంత్రి వాసంశెట్టి సుభాష్, వాసంశెట్టి సత్యం ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా సహాయ సహకారాలు అందించిన ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు మంత్రి వాసంశెట్టి సుభాష్, వాసంశెట్టి సత్యం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసి, అభినందించారు.