సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంచిన ఎమ్మెల్యే కవ్వంపల్లి (మాదాపూర్ లో రేషన్ షాప్ ప్రారంభం.)

పయనించే సూర్యుడు న్యూస్ :జులై /07:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద మంజూరైన చెక్కులను మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ సోమవారం పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఆయన స్వయంగా చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆపద సమయంలో అండగా నిలిచేందుకే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు.గన్నేరువరం మండలానికి 26వ విడతలో భాగంగా 50 మంది లబ్ధిదారులకు రూ.18,66,500 మంజూరు కాగా, లబ్ధిదారులకు ఇప్పుడు చెక్కుల రూపంలో అందజేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. అనారోగ్యం, ప్రమాదాలు వంటి వైద్య చికిత్స కోసం అప్పుల పాలవకుండా, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, సంక్షేమ పథకాల అమలుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గన్నేరువరం ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, తహశీల్దార్ ఇప్ప నరేందర్, బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డు సునిల్, మాజీ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, పార్టీ నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్డి, అలువాల కోటి, జె.మన్మోహన్ రావు,మాతంగి అనిల్,చింతల శ్రీధర్ రెడ్డి, రాజేశ్వరి, న్యాత జీవన్, మాదరి శ్రీనివాస్, మార్కం మల్లేశ్, మల్ రెడ్డి, తిరుపతి, సంగు వేణు, డి.మల్లేశం, సంతోష్ తోపాటు వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ గ్రామశాఖల అధ్యక్షులు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాదాపూర్ లో రేషన్ షాప్ ప్రారంభం గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన చౌక ధరల దుకాణాన్ని సోమవారం మానకొండూర్ శాసనసభ్యుడు, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి దుకాణాన్ని ప్రారంభించిన అనంతరం లబ్ధిదారులకు రేషన్ బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అందుకే కొత్త రేషన్ షాపులను మంజూరు చేసి గ్రామాల్లోనే సరుకులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రేషన్ షాపుల ద్వారా అందించే నిత్యవస సరకుల తూకంలో మోసం చేస్తే, సరుకులు పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఇప్ప నరేందర్, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డు సునిల్, మాజీ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, పార్టీ నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్డి, మన్మోహన్ రావు, అలువాల కోటి, మాతంగి అనిల్,రాజేశ్వరి, అంజి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *