సనాతన ధర్మ పరిరక్షణకు ఉపనయనం ఎంతో దోహదకారి

మెదక్ జిల్లా డిడిఎన్ అధ్యక్షులు శలాక రాజేశ్వర్ శర్మ

పయనించే సూర్యుడు జూలై 5 పెద్ద శంకరంపేట మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్న అశోక్) పెద్ద శంకరం పేట స్థానిక పురోహితులు ఆర్ మహేష్ శర్మ కుమారుడు చి అవీక్షిత్ శర్మ కు షోడశ కర్మల లో అత్యంత కీలకమైన ఉపనయన సంస్కారం నిన్న నిర్వహించడం అయ్యింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా డిడిఎన్ అర్చక సంఘం అధ్యక్షులు శలాక రాజేశ్వర్ శర్మ హాజరై వాటువును ఆశీర్వదించారు వారు మాట్లాడుతూ సనాతన ధర్మం పరిరక్షించి వేద విద్యను ప్రజలకు మరింత చేరువలోకి తీసుకెళ్లడం లో ఉపనయన సంస్కారం షోడశ కర్మ ల లో అత్యంత కీలకమైనది అన్నారు ఈ కార్యక్రమం లో రాష్ట్ర అర్చక సంఘం ఉపాధ్యక్షులు గుడి చంద్ర శేఖర్ పెద్ద శంకరం పేట మండల బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రాయల కృష్ణ శర్మ మెదక్ జిల్లా డిడిఎన్ అర్చక సంఘం కోశాధికారి శిలాంకోట ప్రవీణ్ శర్మ నరేష్ శర్మ అభిలాష్ శర్మ గుడి సంతోష కుమార్ ప్రముఖ కృష్ణ యజుర్వేద స్మార్త పండితులు గుడి శ్రీనాథ్ గుడి శ్రీనందన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *