ఆగష్టు 9 న రాష్ట్రస్థాయి లలిత సంగీత దేశభక్తి గీతాల పోటీలు :ఎస్ కళాంజలి

పయనించే సూర్యుడు-05-07-2026-రాజంపేట న్యూస్ : భారతదేశ 80 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగష్టు 9వ తేదీన రాజంపే పట్టణంలో లలిత సంగీత – దేశభక్తి గీతాల పోటీలను నిర్వహించనున్నట్లు రాజంపేట కళాంజలి సంస్కృతి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు కార్యదర్శి ఎస్.కళాంజలి, ఎస్.విజయ్ కళ్యాణ్ ఒక శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. సమాజంలో దేశభక్తిని పెంపొందించే విధంగా వాయిద్య సహకారము లేకుండా తమ సొంత గొంతుకతో గాయనీ-గాయకులు, ఔత్సాహికులు, కళాకారులు పాడాలని కోరారు. 15సం.ల నుండి అన్ని వయస్కుల యువతీ, యువకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొనవచ్చునని అన్నారు. నామమాత్రపు ప్రవేశముగా రూ 100 పాల్గొనే ప్రతి విభాగానికి చెల్లించాలని కోరుతూ పోటీరోజు మధ్యాహ్నం ఉచిత భోజన వసతి ఏర్పాటు చేయబడుతుందన్నారు. ఈ సందర్భంగా విజేతలకు ప్రతి విభాగంలో విడివిడిగా ప్రధమ, ద్వితీయ, తృతీయ మరియు రెండు కన్సిలేషన్ స్థానాల్లో స్వాతంత్ర సమర వీరుల ప్రత్యేక షీల్డ్ లు, పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందన ప్రశంస పత్రాన్ని అందజేస్తామన్నారు. పూర్తి వివరాలకు 9490 884 300 నెంబర్ ను చరవాణి ద్వారా సంప్రదించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *