పయనించే సూర్యుడు జులై 7 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండలంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పటేల్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు ప్రక్రియ, ఫారాల స్వీకరణ, వివరాల సేకరణ తీరును పరిశీలించి అధికారులతో మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో తప్పనిసరిగా నమోదు అయ్యేలా పారదర్శకంగా, వేగవంతంగా ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. బిజినపల్లి మండలంలో మొత్తం 61,545 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటికే 2 వేలకుపైగా ఓటర్ల వివరాలు సేకరించినట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ఎమ్మార్వో మునీరుద్దీన్ రెవెన్యూ అధికారులు గ్రామ సర్పంచ్ మిద్దె ఇంద్ర రాములు, బీఎల్ఏ మిద్దె సూరి శివలీలను కలెక్టర్ అభినందించారు. గ్రామంలో ఓటరు నమోదు ప్రక్రియలో ఎలాంటి తప్పులు, తేడాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బీఎల్ఏలకు సూచించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.