పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి జులై 7 ఫేక్ కాల్స్ పట్ల పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెట్‌పల్లి ఎస్సై పబ్బా కిరణ్ కుమార్ సూచించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ తన పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు ఫేక్ కాల్స్ చేస్తూ “తనకు అత్యవసరంగా డబ్బులు అవసరమని, ఫోన్‌పే ద్వారా నగదు పంపాలని” కోరుతున్నట్లు కొందరు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు ప్రజలను, ముఖ్యంగా వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. ఎవరైనా తన పేరుతో లేదా ఇతర అధికారుల పేరుతో డబ్బులు పంపాలని కోరితే వెంటనే నమ్మకుండా, సంబంధిత వ్యక్తిని నేరుగా సంప్రదించి నిజానిజాలు నిర్ధారించుకోవాలని సూచించారు. అలాగే ఇలాంటి ఫేక్ కాల్స్ వచ్చినట్లయితే, సంబంధిత ఫోన్ నంబర్ వివరాలను గుర్తించి వెంటనే 918712656794 ఈ సెల్ నంబర్ ద్వారా తన దృష్టికి తీసుకురావాలని మెటపల్లి ఎస్సై పబ్బా కిరణ్ కుమార్ కోరారు.