బిజెపి గుంటూరు ఇంచార్జి యాళ్ల దొరబాబు ని జిల్లా కోశాధికారి సన్మానం

*యళ్ళ దొరబాబుకు ఘన * సన్మానించిన గ్రంధి నానాజీ

పయ నించే సూర్యుడు జూలై 7 (ముమ్మిడివరం ప్రతినిధి) భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా ఇంచార్జి యళ్ళ దొరబాబును పదవి చేపట్టిన తొలిసారిగా కాట్రేనికోన మండలం వచ్చిన సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ స్వగృహంలో యళ్ళ దొరబాబుకు పూలమాల వేసి శాలువాతో సత్కరించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నందుకు ఈ సన్మానం చేశామని గ్రంధి నానాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు మోకా వెంకట సుబ్బారావు పాల్గొని మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమానికి చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని అన్నారు. పార్టీ కార్యకర్తలు అందరూ సమన్వయంతో పని చేస్తే రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సన్మాన కార్యక్రమంలో మేకల చంటి డేగల వెంకటరమణ, శ్రీను , పలువురు కార్యకర్తలు అభిమానులు పాల్గొని యళ్ళ దొరబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *