పయనించే సూర్యడు పత్రిక జూలై 08 గోకవరం మండల రిపోర్టర్ దొరబాబు: మహిళలకు ,విద్యార్థిని, విద్యార్థులకు గోకవరం బస్టాండ్ వద్ద ఇబ్బందికరంగా ఉన్న బ్రాందీ షాపును వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నాడు గోకవరం మండలం శివరాం పట్నం గ్రామంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ మేము అధికారంలోకి వస్తే మద్యాన్ని దప దపాలుగా నివారిస్తాం, నిర్మూలిస్తం అని చెప్పుకుని అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ప్రజల మధ్యలో, బహిరంగ ప్రదేశాల్లో బ్రాందీ షాపులు పెట్టారని కూటమి ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. ప్రభుత్వాధికారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు బ్రాందీ షాపుల యాజమాన్యాలు ఇచ్చే మామూళ్ల మత్తులో మునిగిపోతున్నారని ఆయన తెలిపారు. కేవలం రాజకీయ నాయకుల అండదండలతోనే బ్రాందీ షాపులను బహిరంగ ప్రదేశాల్లో పెట్టారని, ఈ షాప్ అక్కడ ఉండడం వల్ల ప్రజలకు, మహిళలకు, విద్యార్థినులకు ఇబ్బందికరంగా ఉందని ఆయన తెలిపారు. తక్షణమే గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న బ్రాందీ షాపును తక్షణమే తొలగించాలని,అలాగే గ్రామాల్లో బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయాయని, వాటిని అరికట్టడంలో కూడా ఎక్స్చేంజ్ శాఖ అధికారులు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. వాటిని కూడా నిర్మూలించాలని ఆయన డిమాండ్ చేశారు .లేనియెడల మా ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రమేష్, గ్రామ నాయకులు పెద్ద, లక్ష్మణ్, అప్పలరాజు, వీరబాబు, మహిళలు పాల్గొన్నారు.