మంగళవారం సంత ఏర్పాటుకు సహకరించిన ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డిని,రవికుమార్ యాదవ్ ని సన్మానించినమార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు

పయనించే సూర్యుడు, జూలై 08 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి మియాపూర్ న్యూ కాలనీ మార్కెట్ ఏర్పా టుకు సహకరించినందుకు గాను కూరగాయల మా ర్కెట్ కమిటీ సభ్యులు స్థానిక ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ని ,రవికుమార్ యాదవ్ ని ఆహ్వానించి పేద ప్రజలకు అండగా నిలిచినందుకు వారి ఇరువురిని సన్మానించారు.మీరు ఏ ఒక్కరికి భయపడకుండా నిశ్చింతగా, నిర్భయంగా మీరు మార్కెట్ ను నిర్వహించుకోవచ్చునని దళారులకు, కబ్జాదా ‌రులకు భయపడే ప్రసక్తి లేదని, అవసరమైతే పార్ల మెంటులో మాట్లాడి మోడల్ మార్కెట్ యార్డ్ కింద ఈ ల్యాండ్ ను సాంక్షన్ చేపిస్తానని ఎంపీ తెలిపారు. పేద ప్రజల తరఫున అధికారులతో చర్చించి మార్కెట్ నిర్వహించేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అధికారికంగా పర్మిషన్స్ వచ్చే విధంగా చొరవ చూపిన స్థానిక ఎంపీకి స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులకు రవి కుమార్ యాదవ్ ‌మార్కెట్ కమిటీ సభ్యుల తరఫు న కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు ఖాజా బాషా, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయ కులు మహేష్ యాదవ్, అడ్వకేట్ కిషోర్ యాదవ్, లక్ష్మణ్ ముదిరాజ్,గణేష్ ముదిరాజ్,పవన్ యాదవ్, నాగులు,పట్టాభిరామ్,శివ భాష,రాము తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *