పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జూలై 09 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల భవిత కేంద్రంలో బుధవారం దివ్యాంగుల పిల్లలకు ఫిజియోథెరపీ ద్వారా వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు బెక్కం తిరుపతి, ఐఈఆర్పి పెద్దోల్ల సృజన, పాఠశాల సముదాయం ప్రధానోపాధ్యాయులు కాపు శ్రీనివాస్ ఉపాధ్యాయులు చెరుకు మహేశ్వర శర్మ, పుర్రె రమేష్ దివ్యాంగ పిల్లలు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భవిత కేంద్రం ఐఈఆర్ పి సృజన మాట్లాడుతూ , ప్రతి బుధవారం భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు వైద్య సేవలు అందిస్తున్నామని ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు