పయనించే సూర్యుడు. న్యూస్ జూలై 9 రిపోర్టర్. కొత్వాల లింబాద్రి నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలం భీమ్‌గల్ గ్రామంలో నిర్వహించనున్న ఊరపండుగ సందర్భంగా సోమవారం పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించాలని సర్వసమాజ్ కమిటీ విజ్ఞప్తి చేసింది.ఈ మేరకు బుధవారం మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో) స్వామికి సర్వసమాజ్ కమిటీ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు పతాని కృష్ణ మాట్లాడుతూ, ఊరపండుగలో విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని స్థానిక సంప్రదాయాలను వీక్షించే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో సెలవు ప్రకటించాలని కోరారు. ఈ అంశంపై విద్యాశాఖ అధికారులు సానుకూలంగా స్పందించి తగిన నిర్ణయం తీసుకోవాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.