విశ్రాంత ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యం.విశ్రాంత ఉద్యోగుల జిల్లా జాయింట్ సెక్రటరీ గుండు అనంతరాములు

పయనించే సూర్యడు జూలై 09 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు నడిగూడెం:- విశ్రాంత ఉద్యోగుల సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత యలక.వెంకటరెడ్డి జన్మదినం సందర్భంగా వారికి కుటుంబ సభ్యుల సమక్షంలో శాలువాతో సన్మానించి, స్వీట్లు పంచి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా జాయింట్ సెక్రెటరీ గుండు అనంత రాములు మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా విశ్రాంత ఉద్యోగుల సంఘం పనిచేస్తుందని అన్నారు.విశ్రాంత ఉద్యోగుల వృత్తి రీత్యా పొందే,పదవి విరమణ తర్వాత ప్రభుత్వం నుండి పొందే ప్రయోజనాలను విశ్రాంత ఉద్యోగులందరికీ సమానంగా పొందే విధంగా కృషి చేస్తామని తెలిపారు.విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడమే అజెండాగా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం పని చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం మండల శాఖ అధ్యక్షులు ఎండి ఖలీల్ అహ్మద్, మండల కార్యదర్శి ఎల్ బాలాజీ నాయక్, మండల శాఖ ఆర్థిక కార్యదర్శి ఎండి ఇబ్రహీం,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *