ఘనంగా అనపాల అప్పల నరసమ్మ వర్ధంతిని పురస్కరించుకుని కుమారుడు అణపాల ఆంజనేయ రెడ్డి ఆధ్వర్యంలో అన్నసంతర్పణ..

పయనించే సూర్యుడు మే 20, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) వాయిస్ ఓవర్.. ప్రముఖ సేవకుడు అణపాల ఆంజనేయ రెడ్డి ఆధ్వర్యంలో తల్లి అలపాల అప్పల నరసమ్మ వర్ధంతిని పరిష్కరించుకుని కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం అభయ ఆంజనేయస్వామి ఆలయం ఎదురుగా అన్నసంతర్పణ కార్యక్రమాన్ని అక్క చంద్రకళ బావ బాబురావు ఆశీస్సులతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనపాల మాట్లాడుతూ మా తల్లి అణపాల అప్పలనరసమ్మ మన మధ్యన లేకపోయినా ఆమె ఆశీస్సులు మా వెంటే ఎప్పుడూ ఉంటాయని అన్నారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఆమె పేరున అన్నసంతపణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సద్గురు సాయి బాబా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు సాయిరాం రాంబాబు, చిరంజీవి, కంది పట్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *