పయనించే సూర్యుడు మే 21, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండల పరిధిలోని చిన్నమండవ గ్రామంలో తాగునీటి పైపులైన్‌కు సంబంధించిన మరమ్మతు పనులు విజయవంతంగా పూర్తి చేశారు. గ్రామంలో రెండు చోట్ల గేట్ వాల్వులు ఫెయిల్ కావడంతో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా పంచాయతీ సిబ్బంది వెంటనే స్పందించి పాత వాల్వులను తొలగించి కొత్త గేట్ వాల్వులను ఏర్పాటు చేశారు.గ్రామ ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించేందుకు అధికారులు వేగంగా చర్యలు చేపట్టి మరమ్మతు పనులను పూర్తి చేశారు. ఈ పనులను గ్రామ సర్పంచ్ ప్రత్యక్షంగా పరిశీలించి, పనులు నాణ్యతగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి సౌకర్యాలను మెరుగుపరచడమే తమ లక్ష్యమని సర్పంచ్ తెలిపారు.