పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మే 21 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో గ్రామ సేవా సమితి ఆధ్వర్యంలో నూతన హనుమాన్ దేవాలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బద్దం మహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా తమ్మటి నరేష్, ప్రధాన కార్యదర్శిగా సామల్ల మహేష్, కోశాధికారిగా జవ్వాజీ నర్సయ్య, సంయుక్త కార్యదర్శిగా పాలెపు దశ కుమార్ను ఎన్నుకున్నారు. సలహాదారులుగా కొల్లూరి వేణు, కొడిమ్యాల లింగమూర్తి, దండ వేణి గంగారాజం, కంటే నాగభూషణ్, నేతుల సోమయ్య, బొమ్మన ముత్తయ్య, గుండా ఆనంద్లను నియమించారు. అధ్యక్షుడు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజల సహకారంతో దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ నీరటి శ్రీనివాస్, గ్రామ సేవా సమితి అధ్యక్షుడు అనుపురం చిన్న లింబాద్రిగౌడ్, జిల్లా ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, ఉపసర్పంచ్ సాయి రెడ్డి, గ్రామ నాయకులు, వార్డు సభ్యులు, యువకులు పాల్గొన్నారు.