పయనించే సూర్యుడు న్యూస్, మే 21 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : ప్రత్తిపాడు మండలం పోతులూరు గ్రామంలో సిపిఎం లిబరేషన్ నాయకుడు మానకొండ లచ్చబాబు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన నేపథ్యంలో, ఆయనను ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్సిపి నాయకులు, నరసాపురం పార్లమెంటు పరిశీలకులు, ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణం రాజు పరామర్శించారు. ఈ సందర్భంగా లచ్చబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మురళిరాజు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ రూ.10,000 ఆర్థిక సాయం అందజేశారు. భవిష్యత్తులో ఎలాంటి కష్టసమయంలోనైనా తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పోతులూరు సర్పంచ్ బొండి రాంబాబు, వైఎస్సార్సిపి సీనియర్ నాయకులు శెట్టి సత్తిబాబు, చెక్కపల్లి నాగేశ్వరరావు, మాజీ వైస్ సర్పంచ్ పంచాది చంటిబాబు, తలారి రాజుబాబు, ఎలుగుబంటి బాబ్జి, చెక్కపల్లి బుజ్జిబాబు, మాది సత్తిబాబు, మాది చంటిబాబు, చింతపల్లి ఏసుబాబు, బోండి సుమంత్, చిన్నం అచ్చిరాజు, వాసా సతీష్, బండి దాసు, నాగులపల్లి వీరబాబు, మాది ప్రకాష్, కోలా తాతబాబు, జువ్వల దొరబాబు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.