వడదెబ్బపై యుద్ధం

* గొల్లపెల్లిలో సామాజిక కార్యకర్తల సేవా యజ్ఞం!

పయనించే సూర్యుడు 22-5-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు ) జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో “సామాజిక సేవ మనందరి బాధ్యత” అనే నినాదాన్ని నిజం చేస్తూ, గొల్లపెల్లి మండల కేంద్రంలో సామాజిక కార్యకర్తలు మానవత్వాన్ని చాటుకున్నారు. పెరుగుతున్న భానుడి భగభగలకు తోడు, వడదెబ్బ బారిన పడి ప్రజలు అల్లాడిపోతున్న తరుణంలో స్థానిక సామాజిక కార్యకర్తలు గంగాధర మధుసూదన్ మరియు శాతల్ల లక్ష్మణ్ అభినందనీయమైన చొరవ తీసుకున్నారు. ​అవగాహనతో కూడిన పంపిణీ ​ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన వీరు, వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులను సంప్రదించారు. వారి సహకారంతో ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లను సేకరించి, గురువారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో రైతులకు మరియు సాధారణ ప్రజలకు పంపిణీ చేశారు. కేవలం పంపిణీకే పరిమితం కాకుండా, ఎండల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ​ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త గంగాధర మధుసూదన్ మాట్లాడుతూ కొన్ని కీలక సూచనలు చేశారు. ​మన జిల్లాలో ఉష్ణోగ్రతలు సుమారు 42°C కి చేరుకున్నాయిని అత్యవసర పని ఉంటే తప్ప మధ్యాహ్నం 12:00 నుండి 4:00 గంటల వరకు బయటకు రావద్దుని అన్నారు. ​ఒక లీటర్ నీటిలో ఒక ఓ ఆర్ ఎస్ ప్యాకెట్ కలుపుకుని తాగడం ద్వారా డీహైడ్రేషన్‌ను అరికట్టవచ్చుని అన్నారు. ​వడదెబ్బ తగలకుండా తలపాగా లేదా గొడుగు వాడాలని, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని కోరారు. ​ఈ సేవా కార్యక్రమంలో 5వ వార్డు మెంబర్ సాంగేమ్ కళ్యాణ్, స్థానిక నాయకులు ఎనగందుల రమేష్, ఓర్సు రాజకుమార్ మరియు ఇతర స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *