బోధనలో 14 బైకులు సీజ్

పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ మే 22 చిల్లకూరు మండలం బోధనలో పోలీసులు గురువారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో భాగంగా ప్రతి ఇంటిని పరిశీలించారు. సరైన పత్రాలు లేని 14 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో ఉంటున్న ఇతర రాష్ట్రాలకు చెందిన 27 మంది వ్యక్తుల వేలిముద్రలు సేకరించి పరిశీలించారు. ఈ కార్డెన్ సెర్చ్ లో గూడూరు రూరల్ సీఐ కిషోర్ బాబు, ఎస్సై సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *