తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు వేతనాలను పెంపొందించిన సందర్భంగా క్షీరాభిషేకం.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చిత్ర పటలకు క్షీరాభిషేకం ..

పయనించే సూర్యుడు న్యూస్ మే 23 మందమర్రి మండల ప్రతినిధి బొద్దుల భూమేష్ మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ కాంగ్రెస్ పార్టీ మందమర్రి పట్టణ అధ్యక్షులు మంద తిరుమల్ రెడ్డి,రాష్ట్ర నాయకులు బండి సదానందం యాదవ్, పట్టణ మాజీ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, జిల్లా కార్యదర్శి, మందమర్రి పట్టణ మున్సిపాలిటీ ఇంచార్జ్ గోపతి భానేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి, పుల్లూరి లక్ష్మణ్, జిల్లా కార్యదర్శి ఆకారం రమేష్, సీనియర్ నాయకులు సొత్కు సుదర్శన్,మందమర్రి పట్టణ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్మికుల పక్షాన కనీస వేతనాలు మూడు జోన్ల విభాగంగా కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంపొందించిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఆనాడు కేంద్ర కార్మిక శాఖ మంత్రివర్యులు స్వర్గీయ (కాకా)గడ్డం వెంకస్వామి నుండి ఈనాడు రాష్ట్ర మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ వరకు కార్మికుల పక్షాన నిలబడే కుటుంబం కాకా వెంకటస్వామి కుటుంబం అని కొనియాడారు అదేవిధంగా ఈనాడు కార్మికులకు అండగా నిలబడి వారికి చాలిచాలని వేతనాలతో కార్మిక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంగా వారికి వేతనాలు పెంచాలి ఆర్థికంగా ఎదగాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు తో చర్చించి, ఒప్పించి కార్మికుల పక్షాన వేతనాలు పెంచిన ఘనత రాష్ట్ర మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి అని తెలియజేశారు. అలాగే వేతనాలు పెంచిన సందర్భంగా రాష్ట్రంలోని ఒక కోటి పదకొండు లక్షల కార్మికుల కుటుంబం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి కి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కి ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేస్తూ కొనియాడారు. దానికి నిదర్శనంగా మందమర్రి పట్టణ మున్సిపాలిటీ కార్మికులు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట కార్మిక శాఖ మంత్రి చిత్ర పటాలకు పాలాభిషేకం చేసి సంతోషం వ్యక్తం చేశారు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలు పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలు చెన్నూరు నియోజకవర్గ ప్రజలు కార్మికుల పక్షాన పేద బడుగు బలహీన వర్గాల పక్షాన నిరంతరం కృషి చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ కాకా వెంకటస్వామి ఆశీస్సులతో రాష్ట్ర మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ అని ప్రజలు గమనించగలరని అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని మరొకసారి అధికారం లోకి తీసుకొని వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మందమర్రి పట్టణ కమిటీ ఉపాధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు,పట్టణ మహిళా నాయకురాళ్ళు మైనార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు,మీడియా, సోషల్ మీడియా కమ్యూనికేషన్స్ ఇంచార్జీలు,పట్టణ 24 వార్డుల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *