ఘనంగా అఖండ హరినామ సప్తహ ఐదవ రోజు

* ముఖ్యఅతిథిగా దుండ చంద్రశేఖర్ మహారాజ్

పయనించే సూర్యుడు న్యూస్ మే 23 సాలూర : సాలూర మండల కేంద్రంలోని హనుమాన్ మందిరం వద్ద శుక్రవారం ఘనంగా అఖండ హరినామ సప్తహ ఐదవ రోజు కార్యక్రమం కొనసాగుతుంది దుండ చంద్రశేఖర్ మహారాజ్ మఠాధిపతి దేగ్లూర్ వారు విచ్చేశారు ఆయనకు సాలుర గ్రామ మహిళలు పెద్ద ఎత్తున మంగళ హారతులతో పూల జల్లులతో స్వాగతం పలికారు మహారాజ్ మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ భక్తి మార్గంలో నడవాలని దైవభక్తి ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడే మనం మంచి మార్గంలో ఉంటామని అన్నారు మహారాజ్ కు గ్రామ పెద్దలు మహిళలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని ఆయన యొక్క దర్శనం చేసుకున్నారు ఈ మహారాజు రాకతో సాలురలో పండుగ వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *