కేంద్ర ప్రభుత్వంలోని మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో

పయనించే సూర్యుడు: మే: 24/26 సత్తుపల్లి రూరల్: రిపోర్టర్: గద్దె. విజయ బాబు డెవలప్మెంట్ కమిషనర్ (హ్యాండీ క్రాఫ్ట్స్) ద్వారా అమలు అవుతున్న ఇంప్రూవ్డ్ టూల్ కిట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాం (ఐ టి డి పి) పథకం ప్రధానంగా చేతిపనులు, కుట్టు పని, హస్తకళలు చేసే మహిళలు మరియు కళాకారులకు శిక్షణ ఇచ్చి, స్టైఫెండ్ అందించి, కుట్టు మిషన్లు మరియు పరికరాలు పంపిణీ చేయడానికి ఉద్దేశించబడింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ పథకాన్ని కొన్ని ఎన్జీవోలు, మహిళా సంఘాలు మరియు శిక్షణ కేంద్రాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని భారతీయ జనతా పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. శిక్షణ పేరుతో లబ్ధిదారులను ఎంపిక చేసి, వారికి రావాల్సిన స్టైఫెండ్‌ను వెనక్కి తీసుకోవడం, నిజమైన అర్హులకు పరికరాలు అందకుండా తమకు నచ్చిన వారికి మాత్రమే ప్రయోజనాలు కల్పించడం వంటి ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాకుండా ఈ పథకం ద్వారా ఎవరు లబ్ధి పొందుతున్నారు, ఏ నియోజకవర్గంలో ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎంతమందిని ఎంపిక చేశారు, ఎంతమందికి శిక్షణ ఇచ్చారు, ఎంతమందికి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి, ఎంతమందికి కుట్టు మిషన్లు మరియు పరికరాలు అందించారనే వివరాలను కూడా ప్రజలకు తెలియనీయకుండా రహస్యంగా వ్యవహరిస్తున్నారని మేము ఆరోపిస్తున్నాము. కనీసం స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలకు కూడా సమాచారం ఇవ్వకుండా కొందరు మహిళా సంఘాల నాయకులు మరియు ఎన్జీవోలు ఈ పథకాన్ని తమ స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వివరాలను బయటపెట్టాలని అడిగితే డేటా ఇవ్వమని బెదిరింపులకు దిగడం మరింత అనుమానాలకు తావిస్తోంది. అందువల్ల సంబంధిత కేంద్ర మరియు రాష్ట్ర స్థాయి అధికారులు వెంటనే రంగంలోకి దిగి: పూర్తి స్థాయి విచారణ జరపాలని, ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన లబ్ధిదారుల డేటాను ప్రజలకు వెల్లడించాలని, నిజమైన అర్హులకు న్యాయం చేయాలని, ఈ పథకంలో జరిగిన అక్రమాలు, అవినీతిని వెలుగులోకి తేవాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బానోతు విజయ్, జిల్లా కార్యదర్శి సురేందర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు పాలకొల్లు శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి మంద శివ, తెనాలి అశోక్, నూతలకంటి పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *