ఆటో కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి ఏఐటీయూసీ

పయనించే సూర్యుడు: మే:24/26 సత్తుపల్లి రూరల్: రిపోర్టర్: గద్దె. విజయ బాబు కార్మికులకు సంక్షేమ చట్టాన్ని ఏర్పాటు చేయాలి నిమ్మటూరి సత్తుపల్లి: పట్టణంలోనీ సిద్ధారం రోడ్ ఆటో ఓనర్ కమ్ డైవర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా ఎఐటియుసి ఉపాధ్యక్షులు నిమ్మటూరి రామకృష్ణ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా.. రామకృష్ణ మాట్లాడుతూ పెరిగిన పెట్రోల్. డీజిల్ . వలన ఆటో కార్మికులపై ములీగే నక్క పైన తాటికాయ పడ్డట్టుగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పన్నులు విధిస్తా ఉందని, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చి ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని సంవత్సరానికి రూ. 12000 రూపాయల హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం సంపన్నులకు రాయితీలు కల్పిస్తూ బడుగు జీవులపై పన్నుల భారం మోపటం ఎంతవరకు సమంజసం అని రామకృష్ణ ప్రశ్నించారు. తక్షణమే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆటో కార్మికులకు సంక్షేమ చట్టాన్ని తీసుకువచ్చి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని, ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో వర్కర్ యూనియన్ గౌరవ అధ్యక్షులు జక్కంపూడి వెంకటరావు పుల్లయ్య. అధ్యక్షులు చిల్లకండ్ల కాశి రావు. భయ్యా కోటేశ్వరరావు. కొండపల్లి రాంబాబు. తడికమళ్ళ హరిబాబు. పర్సా వెంకన్న. గరికంటి అర్జున్ రావు. సకుర్తి వెంకటేశ్వరరావు. గుదే వినయ్ మరికంటి వెంకటేశ్వరావు. సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *