ఐకెపి సిబ్బంది వినూత్న నిరసన …

ఖాళీ కడుపులతో.. కళ్ళకు గంతలతో... సంఘీభావం తెలిపిన పలు ప్రజా సంఘాల నాయకులు ...

పయనించే సూర్యుడు న్యూస్ :మే 24,తల్లాడ రిపోర్టర్ మండల కేంద్రంలో 2వ రోజు ఐకెపి సిబ్బంది కళ్లకు గంతలు కట్టి వినూత్నంగా నిరసనకు దిగారు.చాలీ,చాలనీ జీతాలతో ఏళ్ల తరబడి పనిచేస్తూ మా కుటుంబాలను అంధకారంలో పడేసామని,కనీస కుటుంబ అవసరతలు కూడా తీర్చుకోలేనీ దుస్థితిలో జీవితాలు ఆవిరైపోతున్నాయని మీడియా ముందు వారు వాపోయారు. తల్లాడ మండల కేంద్రంలో రెండు రోజులుగా ఐకెపి సిబ్బంది దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పలు అంశాలపై సత్వర పరిష్కారం కోరుతూ శాంతి నిరవదిక సమ్మె చేయడం అందరికీ తెలిసిందే.ఈ నిరసన కార్యక్రమానికి పలువురు సిపిఎం నాయకులు,సిఐటియు నాయకులు,ప్రజాసంఘాల నాయకులు శనివారం ఉదయం దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలియజేశారు. అదేవిధంగా పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని న్యాయ బద్ధమైన డిమాండ్లు తీర్చడం సరైనదేనని దీనికి మా వంతు సహకారం ఎల్లవేళలా ఉంటున్నారు.మీ సమస్య పరిష్కారంలో మా వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘీభావంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఆయనాల రామలింగేశ్వరరావు, రైతు సంఘం నాయకులు,మాజీ సర్పంచ్ నల్లమోతు మోహనరావు, కొమ్మినేని రాంబాబు, పేరసాని వెంకటయ్య, శివలంక వెంకట నరసయ్య, అన్ని గ్రామాల విఏవోలు, మహిళా సంఘాల కార్యకర్తలు, ప్రతినిధులు, డ్వాక్రా లీడర్లు తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *