పయనించే సూర్యుడు న్యూస్ మే 24 రాజన్న సిరిసిల్ల జిల్లా (స్టాఫ్ రిపోర్టర్ ఎమ్.ఎ.షకీల్) వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా టియుడబ్ల్యూజే పని చేస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో యూనియన్ జిల్లా క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ గా సయ్యద్ రసూల్, ఎలక్ట్రానిక్ మీడియా సెక్రటరీగా అడ్డగట్ల మల్లికార్జున్, టి యుడబ్ల్యూజే సంయుక్త కార్యదర్శిగా కమటాల విజయ్ కుమార్ లను నియమిస్తూ నియామక పత్రాలను శని వారం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా,ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఇరుకుల ప్రవీణ్ కుమార్, టియుడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి సామల గట్టు లు మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధన కోసం సంఘం అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు .అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను సాధించేంతవరకు యూనియన్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు .అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల మంజూరి విషయంలో ప్రభుత్వం జాప్యం తగదని ఎద్దేవా చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అర్హులైన జర్నలిస్టులకు వెంటనే అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల యూనియన్ పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ నాయకత్వం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ నేతృత్వంలో యూనియన్ కార్యకలాపాలను మరింత వేగవంతం చేస్తామన్నారు. నూతనంగా నియమితులైన యూనియన్ బాధ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.