సమ్మె ఇంకో వారం రోజులు కొనసాగించాలని యూనియన్ జనరల్ సెక్రెటరీ సామా ఎల్లారెడ్డి స్పష్టం చేశారు.

పయనించే సూర్యుడు,మే 24 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ కొండాపూర్ సెంట్రింగ్ యూనియన్ తరుపున చైర్మన్ విశ్వనాధ్ యాదవ్, ప్రెసిడెంట్ రాము యాదవ్, జనరల్ సెక్రటరీ సామ ఎల్లారెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సెంట్రింగ్ రేట్ 51/- రూపాయలు పెరగాలి అని, కార్మి కులకు ఈఎస్ఐ కార్డు ఇవ్వాలని, ప్రతి సైట్ లో సెం ట్రింగ్ మెటీరియల్ దొంగతనలను అరికట్టాలని తేది 16/05/26, నుండి సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అందరూ సమ్మె చేస్తున్నామనితెలిపారు. 8వ రోజు సమ్మెలో భాగంగా ఈ రోజు 23/05/26, కొండాపూర్ యూ నియన్ నుండి ధర్నా చౌక్ వరకు సుమారు 200 మంది కాంట్రాక్టర్స్ టూ వీలర్ ర్యాలీ నిర్వహించి ఈ ధర్నాలో పాల్గొనడం జరిగినది.మా న్యాయ మైన కోరికలు తీరే వరకు సమ్మె ఆపే ప్రసక్తే లేదు అని కొండాపూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ సామ ఎల్లారెడ్డి తెలిపారు.సమ్మె ఇంకో వారం రోజులు కొనసాగించాలని ఈ రోజు తీర్మానిం చడం జరిగినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *