విధి నిర్వహణలో మరోసారి తమ ప్రతిభ సాటిన పెనుగంచిప్రోలు శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయ హోంగార్డ్స్.

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మే 25 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈరోజు న తిరుపతమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు సుమారు మూడు లక్షల రూపాయలు విలువగల గొలుసు పోగొట్టుకొనగా గంటల వ్యవధిలోని హోంగార్డులు ఆలయ పరిసర ప్రాంతాలు మొత్తం వెతికి పట్టుకొని బాధితులకు గొలుసు అందజేసిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. అమరావతి మండలం మల్లాది గ్రామానికి చెందిన బొంతల నాగమల్లేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం అమ్మవారి దర్శనానికి ఇచ్చేశారు. దర్శనం అనంతరం తిరిగి వెళ్లే సమయంలో తమ పిల్లోడి మెడలోని సుమారు మూడు లక్షల రూపాయల గొలుసు జారి పోయినట్టుగా గ్రహించారు, వెంటనే ఆలయ హోంగార్డులను ఆశ్రయించగా వారు ఎంతో శాఖ శాక్యంగా బాధితులు ఏ ప్రదేశాల్లో తిరిగారో అని కనుక్కొని ఆ ప్రదేశంలో వెతుకగా ఒక బొమ్మల దుకాణం వద్ద పడి ఉన్న గొలుసును హోంగార్డ్ యనమదల తిరుపతిరావు(వై.టీ.ఆర్.) కనుగొన్నారు. కనుగొన్న గొలుసును ఆలయ అధికారులు సమక్షంలో తమ తోటి సిబ్బందితో కలిసి బాధితులకు అందజేయడం జరిగింది. గత శుక్రవారం కూడా సూళ్లూరుపేటకు చెందిన భక్తులు పోగొట్టుకున్న సుమారు లక్షల 50 వేల రూపాయలు బ్రాస్లెట్ ను కనుగొని బాధితులకు అందజేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నాగమల్లేశ్వరరావు దంపతులు మాట్లాడుతూ విషయం తెలిసిన వెంటనే స్పందించి తమ గొలుసును రికవరీ చేసిన ఆలయ హోంగార్డులను వారు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *