వెలుగొండలో విషాదం: అకాల మరణం చెందిన మణెమ్మ కుటుంబానికి మాల సంఘం ఆర్థిక సాయం

పయనించే సూర్యుడు మే 26 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వెలుగొండ గ్రామంలో అకాల మరణం చెందిన కంతం మణెమ్మ కుటుంబానికి స్థానిక మాల సంఘం ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకుంది. మణెమ్మ మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ​ఈ విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ సంఘం సభ్యులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అంత్యక్రియలు మరియు కుటుంబ తక్షణ అవసరాల నిమిత్తం సంఘం తరఫున రూ.5,400 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ​ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, సమాజంలో ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. మణెమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆపద సమయంలో స్పందించి బాధిత కుటుంబానికి తోడుగా నిలిచిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ సంఘం సభ్యులను గ్రామస్తులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *