ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా

మహిళ వారోత్సవ కార్యక్రమం

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి మే 26 మెట్‌పల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్ సి ) మరియు అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణీ, బాలింతల ఆరోగ్య పరీక్షలు మరియు పోషకాహార అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడినవి. ఈ కార్యక్రమం మండల వైద్యాధికారి డా. అంజిత్ రెడ్డి సమక్షంలో సీడీపీవో మన్నెమ్మ అంగన్‌వాడీ సూపర్వైజర్ ప్రతిభ మరియు అంగన్‌వాడీ అర్బన్ సిబ్బంది సహకారంతో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలు మరియు బాలింతల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి, అవసరమైన వైద్య సలహాలు మరియు పోషకాహార సూచనలు అందించారు. అదేవిధంగా పోషణ అభియాన్ (న్యూట్రిషన్ మిస్సిన్ )పై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ కార్యక్రమం కూడా నిర్వహించారు. తల్లి మరియు శిశు ఆరోగ్య పరిరక్షణలో పోషకాహారం ప్రాముఖ్యతను అధికారులు వివరించారు. అలాగే అంగన్‌వాడీ కేంద్రంలో నూతన వధూవరుల కోసం ప్రత్యేకంగా పోషకాహార వంటకాల తయారీ కార్యక్రమం నిర్వహించారు. తక్కువ ఖర్చుతో అధిక పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను ఎలా తయారు చేసుకోవాలో పాల్గొనేవారికి ప్రదర్శించి వివరించారు. సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా కుటుంబ ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న మహిళలకు పిల్లలకు పెద్దలతో జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని ప్రమాణం చేయించినారు పోషకాహారం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవాలని ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ అవగాహన కల్పించారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *